మరో కీలక ఘట్టానికి వేళాయే.. చంద్రునికి దగ్గరకు చంద్రయాన్-3!
భారతీయులతోపాటు యావత్ ప్రపంచం కళ్లన్నీ ఇప్పుడు చంద్రయాన్-3పైనే ఉన్నాయి. ఈ క్రమంలో చంద్రయాన్-3 చంద్రుడి ఎంట్రన్స్ లోకి చేరుకుంది. సోమవారం వాహనం కక్ష్య మరోసారి తగ్గింది. దీంతో చంద్రుడి ఉపరితలం నుంచి వాహనం గరిష్ట దూరం ఇప్పుడు 177 కి.మీ. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చేరిన తర్వాత చంద్రయాన్-3 కక్ష్యను మూడోసారి మార్చారు.