కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ .. పార్టీ మారిన ఎమ్మెల్యే అనుచరులు
ములుగు ఎమ్మెల్యే సీతక్కకు బిగ్ షాక్ తగిలింది. సీతక్క ముఖ్య అనుచరులు బీఆర్ఎస్లో చేరారు. వారిని జడ్పీ చైర్ పర్సన్ నాగజ్యోతి కండువా పార్టీలోని ఆహ్వానించారు.
ములుగు ఎమ్మెల్యే సీతక్కకు బిగ్ షాక్ తగిలింది. సీతక్క ముఖ్య అనుచరులు బీఆర్ఎస్లో చేరారు. వారిని జడ్పీ చైర్ పర్సన్ నాగజ్యోతి కండువా పార్టీలోని ఆహ్వానించారు.
సీఎం కేసీఆర్‌పై పండరీ పూర్ ఎమ్మెల్యే సమాధన్ మహాదేవ్ ఔటాడే కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణలో ఏలాంటి అభివృద్ధి చేయాలేదు కానీ మహారాష్ట్రను అభివృద్ధి చేస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ముందు తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. మహారాష్ట్రకు రావాలని సూచించారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ తనకే మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. మూడోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు.
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే శాసనసభ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు. కాని నియోజకవర్గాల్లో క్యాడర్ నుంచి వస్తున్న వ్యతిరేకత.. సీనియర్ లీడర్ల నిరసనలతో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో 10 మందికి బీఫారం కష్టమేననే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేత, ఆర్థిక మంత్రి హరీష్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మల్కాజ్గిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావును మారుస్తారనే ప్రచారం ఉన్నా.. ఆయనతో పాటు మరో 9మందికి గులాబీ బాస్ నో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
బీజేపీ (BJP) గత కొద్ది రోజులుగా నిరసన కార్యక్రమాలను తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా క్యాంపు ఆఫీసులు, ఇళ్ల ముట్టడి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించారు.
రాష్ట్రంలో ఒక్కసారిగా అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. టికెట్లు రాకపోవడంతో బీఆర్ఎస్ నేతలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి టికెట్లు దక్కకపోవడం బాధాకరమన్నారు.
మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన విమర్శలపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. హరీష్ రావును విమర్శించే స్థాయి హనుమంతవురావుకు లేదని సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు.
ఛత్తీస్‌గఢ్ లో దారుణం జరిగింది. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేపై కత్తితో దాడ చేశారు గుర్తుతెలియని దుండగులు. ఖుజ్జిస్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే చన్నీ చందు సాహు ఆదివారం సాయంత్రం డోంగర్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోధారా గ్రామంలో ఓ బహిరంగకార్యక్రమానికి హాజరయ్యింది. ఆ కార్యక్రమంలోనే ఈ ఘటన జరిగింది.