Meghalaya: మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత!
మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి సాల్సెంగ్ . సి. మారక్ (82) శుక్రవారం కన్నుమూశారు.వృద్దాప్య సమస్యలతో బాధపడుతూ..తురా సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.మాజీ ముఖ్యమంత్రి మృతికి నివాళులర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది.