Medigadda: కిషన్ రెడ్డి లేఖతో రంగంలోకి కేంద్రం.. రేపు మేడిగడ్డకు స్పెషల్ టీమ్!
కిషన్ రెడ్డి లేఖతో మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ (Medigadda) పిల్లర్లు కుంగిన ఘటనపై కేంద్రం రంగంలోకి దిగింది. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఈ రోజు రాష్ట్ర నీటిపారుదల అధికారులతో సమావేశం కానుంది. రేపు బ్యారేజ్ ను సందర్శించనుంది.