Uttam Kumar Reddy: వారిని వదిలిపెట్టం.. కాళేశ్వరంపై ఉత్తమ్ వార్నింగ్
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయమై నాసిరకం పనులకు కారణమై ప్రజాధనాన్ని వృధా చేసిన వారిపై చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన ఎల్‌అండ్‌టి సంస్థ ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్‌ను మళ్లీ పరిశీలించాల్సిన అవసరం ఉంది: జాతీయ డ్యాం సేఫ్టీ అథార్టీ
మేడిగడ్డ వంతెన వైఫల్యానికి గల కారణాలు అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని జాతీయ డ్యాం సెఫ్టీ అథారిటీ తెలిపింది. జాతీయ అథారిటీ, సీడబ్ల్యూసీ అధికారుల బృందం మళ్లీ పరిశీలించి బ్యారెజ్ వైఫల్యానికి దారి తీసిన కారణాలను మరింత తెలుసుకోవాల్సి ఉందని పేర్కొంది.
Medigadda Barrage: మేడిగడ్డ వంతెనపై బారికేడ్లు ఏర్పాటు.. నివేదికలో బయటపడ్డ కీలక విషయాలు
మేడిగడ్డ వంతెనపై అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు మేడిగడ్డ బ్యారేజీని డిజైన్ ప్రకారం కట్టలేదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తెలిపింది.
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజ్ చుట్టూ రాజకీయ దుమారం.. అసలేం జరుగుతోంది?
మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ మంగళవారం బ్యారేజ్ ను పరిశీలించింది. 20వ పిల్లర్ వద్ద ఏర్పడ్డ పగుళ్లను పరిశీలించిన బృందం సభ్యులు.. ఇందుకు గల కారణాలు ఏంటనే అంశంపై దృష్టి సారించారు. బ్యారేజ్ పటిష్ఠత, జరిగిన నష్టంపై ఈ కమిటీ అంచనా వేసినట్లు తెలుస్తోంది. బ్యారేజీకి ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీపై పోలీసుల కీలక ప్రకటన.. ఏం అన్నారంటే..
మేడిగడ్డ బ్యారేజీ వంతెన కుంగిన ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. బ్యారేజీ వంతెన పిల్లర్లపై పగుళ్లు ఉన్నట్లు గుర్తించామని.. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఫోరెన్సీక్ క్లూస్ టీం సాయంతో కూడా ఆధారాలు సేకరిస్తున్నామని.. ఇప్పటికే కేంద్ర కమిటీ కూడా బ్యారేజీని పరిశీలించిందని చెప్పారు.