HYDRA: మల్లారెడ్డి అల్లుడికి హైడ్రా షాక్!
TG: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాకిచ్చింది. ఆయనకు సంబంధించిన దుండిగల్‌లోని MLRIT, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని.. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించింది.