Minister Mallareddy: ఈ బండి మీదనే పాలమ్మిన.. స్కూటర్ నడిపి సందడి చేసిన మల్లారెడ్డి!
దసరా వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి సందడి చేశారు. తాను గతంలో పాలమ్మిన స్కూటర్ 20 ఏళ్ల తర్వాత కనిపించడంతో ఆగలేకపోయారు. వెంటనే దాన్ని స్వయంగా నడిపి తన సంతోషాన్ని పంచుకున్నారు. దీని మీదనే నేను పాలమ్మిన.. అంటూ అక్కడి ఉన్న వారికి చెప్పారు. అక్కడ ఉన్న యూత్ స్కూటర్ పై ఉన్న మల్లారెడ్డితో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు.