Local Body Elections 2025: స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. పూణే జిల్లాలోని పలు మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బిగ్‌ట్విస్ట్ చోటుచేసుకుంది. పూణే జిల్లాలోని పలు మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
గుప్త నిధుల కోసం జరిపిన తవ్వకాల్లో భారీగా బంగారం లభించింది. దాన్ని పంచుకునే క్రమంలో వారి మధ్య బిగ్ ఫైట్ నెలకొంది. దాంతో ఆ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇంకేముంది పోలీసులు రంగంలోకి దిగి.. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి విచారిస్తున్నారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్‌కు లేట్ వచ్చిందనే కారణంలో ఓ టీచర్ విద్యార్థినికి బలవంతంగా 100 గుంజీలు తీయించింది. దీంతో అస్వస్థకు గురైన ఆ బాలిక మ-ృతి చెందడం కలకలం రేపింది.
మహారాష్ట్రలోని నాసిక్‌లో విషాదం చోటుచేసుకుంది. సిన్నార్ బస్టాండులో ఫ్లాట్‌ఫామ్‌పై నిల్చున్న ప్రయాణికులపై ఒక్కసారిగా బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.
స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని చెప్పి ఓ విద్యార్థిని పట్ల పాఠశాల యాజమాన్యం కఠినంగా ప్రవర్తించింది. ఆ బాలికతో చేత 100 గుంజిలు తీయించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక వారం రోజుల పాటు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 18 సంవత్సరాల యువకుడు తన ఇన్స్టాగ్రామ్ బయోలో "End Is Beginning" (అంతం ఆరంభం) అంటూ పేర్కొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
మహారాష్ట్రలో ఓ టక్కు బీభత్స సృష్టించింది. ఎదురుగా ఉన్న వాహనాలు ఢీకొనడంతో మంటలు చెలరేగి ఏడుగురు మృతి చెందారు. మరో 20 మంది గాయాలపాలయ్యారు.
నేషనల్ క్రైం రికార్డు బ్యూరో విడుదల చేసిన జాబితా దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోలిస్తే అవినీతిలో మహారాష్ట్ర అగ్రస్ధానంలో ఉందని తేలింది. దేశ వ్యాప్తంగా గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,875 అవినీతి కేసులు నమోదు కాగా అందులో మహారాష్ట్రలోనే 795 కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. చనిపోవడానికి ముందు ఆమె తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్లో ఓ SI తనపై గత ఐదు నెలల్లో నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.