మనిషి కాదు రాక్షసి.. ఏడుస్తోందని చిన్నారిని చిదిమేసింది.. ఎక్కడ జరిగిందంటే..
జబల్ పూర్లో దారుణం జరిగింది. పదే పదే ఏడుస్తూ తన నిద్రను పాడు చేస్తోందని ఆగ్రహంతో రెండేళ్ల చిన్నారిని గొంతు నులిమి చంపేసింది పిన్ని.
జబల్ పూర్లో దారుణం జరిగింది. పదే పదే ఏడుస్తూ తన నిద్రను పాడు చేస్తోందని ఆగ్రహంతో రెండేళ్ల చిన్నారిని గొంతు నులిమి చంపేసింది పిన్ని.
భారత వైమానిక దళం యొక్క ఎయిర్‌షో సందర్భంగా భోపాల్‌లోని ఖాను గ్రామంలో ప్రమాదం జరిగింది. ప్రదర్శనను చూడటానికి స్ధానిక ప్రజలు ఎంతో ఆసక్తితో తరలి వచ్చారు. అయితే, కొందరు యువకులు అతి ఉత్సహంతో ఎయిర్ షో చూసేందుకు అక్కడే ఉన్న ఓ రేకుల షెడ్‌పైకి ఎక్కారు. అంతా ఆసక్తిగా ఎయిర్ షో చూస్తున్న సమయంలో ఆ రేకుల షెడ్ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు అయ్యారు.
ఉజ్జయినిలో రక్తమోడుతూ సహాయం కోసం 8 కి.మీ నడిచిన బాలిక ఘటన మానవత్వానికే మాయని మచ్చగా నిలిచింది. సిగ్గుతో తలదించుకునే చేసిన ఈ ఘటనకు కారణమైన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఆటో డ్రైవర్ తో పాటూ మరో ముగ్గురిని అదుపోలకి తీసుకుని విచారిస్తున్నారు.
జీ-20 విజయవంతంగా నిర్వహించి ప్రపంచానికి 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే సందేశాన్ని అందించిన భారత్ మరోసారి ప్రపంచానికి ఏకతా సందేశాన్ని ఇవ్వనుంది. ఈసారి ఈ సందేశం మధ్యప్రదేశ్‌లోని జ్యోతిర్లింగ ఓంకారేశ్వర్ పుణ్యక్షేత్రం నుండి ఇవ్వనుంది. ప్రపంచానికి ఏకతా సందేశాన్ని అందించిన ఆదిగురువు శంకరాచార్యుల 108 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని గురువారం ఇక్కడ అంగరంగ వైభవంగా ఆవిష్కరించనున్నారు. 12 జ్యోతిర్లింగాలలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నాల్గవది. నర్మదా నది ఒడ్డున ఓంకారేశ్వరుడు, మమలేశ్వరుడు కొలువై ఉన్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, అన్ని తీర్థయాత్రలు చేసిన తర్వాత, ఓంకారేశ్వర తీర్థానికి చేరుకుని.. నర్మదాలో స్నానం చేసి, ఓంకారేశ్వరుని జలాభిషేకం చేయడం తప్పనిసరి.
ప్రధాని నరేంద్రమోదీ విపక్షలపై ఫైర్ అయ్యారు. ఎన్నికల రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం భారీబహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సనాతన సంస్థను ఎవరూ నాశనం చేయలేకపోయారని, ఎవరూ చేయలేరని ఈ దురహంకార కూటమి తెలుసుకోవాలని మోదీ అన్నారు.
ఎన్నికల వ్యాహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోందన్నారు. ఆ రాష్ట్రంలో జరిగిన అభివృద్దే అందుకు నిదర్శనమన్నారు. మరోవైపు రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టిపోటీ ఉంటుందన్నారు.
కాంగ్రెస్ సర్కార్ హయాంలో మధ్యప్రదేశ్ కు బిమారు( అభివృద్ధిలో వెనుకబాటు) అనే ట్యాగ్ లైన్ ఉండేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వ పాలనలో ఆ ట్యాగ్ లైన్ తొలగించగలిగామన్నారు. ఇప్పుడు మధ్య ప్రదేశ్ అంటే అభివృద్దికి మారు పేరుగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో వున్నా పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తుందన్నారు.
మధ్యప్రదేశ్ కు చెందిన దీపక్ అనే వ్యక్తి.. ఎంతో కాలం నుంచి ఓ చిలుకను పెంచుకుంటున్నాడు. అయితే అది ఇటీవల ఎక్కడికో ఎగిరిపోయింది. దీంతో దీపక్ పెంపుడు చిలక ఆచూకీ చెప్తే.. రూ.10 వేలు నగదు ఇస్తామంటూ పోస్టర్లు వేయించాడు. చిలుక తప్పిపోయిన సమయంలో సరిగ్గా ఎగరలేని స్థితిలో ఉందని, వీధి కుక్కలు ఏమైనా దాడి చేశాయోమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. చిలక గత రెండేళ్లుగా తమతో ఉంటుందని, అందుకే అదంటే తమ కుటుంబానికి ఎంతో ఇష్టమని..
దేశం ఎటు వెళ్తోంది..? భారత్‌కు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా.. దేశంలో దళితులకు రక్షణ లేకుండా పోతోంది. దేశాధినేతలు విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో నాదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకుంటారు. ప్రపంచంలో అణ్వాయుధ వ్యవస్థ అధికంగా ఉన్నదేశాల్లో ఇండియా టాప్ 10లో ఉందని ధైర్యంగా మాట్లాడుతారు. జనాభా పరంగా ప్రపంచంలో పెద్ద దేశమని చెప్పుకుంటారు. భారత్‌లో పెట్టుబడులు ఉపందుకున్నాయని, దేశ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పలు చెప్పుకుంటారు. కానీ దేశంలో జరిగే అకృత్యాల గురించి పట్టించుకోరు.