Pawan Kalyan: పవన్ కల్యాణ్ కాపుల కలలను చెరిపేసాడు: తోట త్రిమూర్తులు!
వైసీపీ నేత తోట త్రిమూర్తులు టీడీపీ జనసేన పొత్తు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న కాపుల కలలను చెరిపేశాడు అంటూ ఆయన మీద విరుచుకుపడ్డారు.
వైసీపీ నేత తోట త్రిమూర్తులు టీడీపీ జనసేన పొత్తు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్న కాపుల కలలను చెరిపేశాడు అంటూ ఆయన మీద విరుచుకుపడ్డారు.
వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ నేత లోకేష్. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో సీఎం జగన్ విఫలం అయ్యారని మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలిపారు లోకేష్.
సీఎం జగన్ పై చురకలు అంటించారు టీడీపీ నేత లోకేష్. ఆయన మాటలు మాత్రమే కోటలు దాటుతాయి, పనులు గడపదాటవు అంటూ విమర్శలు చేశారు. కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదని అన్నారు.
పిల్లలు బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తూ ట్యాబ్‌లు పంపిణీ చేస్తుంటే దీన్ని వక్రీకరిస్తున్నారని లోకేశ్‌పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. అశ్లీల వీడియో చూసే అలవాటు లోకేశ్‌కు ఉంది కాబట్టే.. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయ లబ్ధికోసం లోకేష్ మొక్కుబడి పాదయాత్ర చేశారని విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి పేర్నినాని. యాత్ర కోసం వచ్చి మేనమామ కొడుకు చనిపోతే శవాన్ని చూసే సంస్కారం కూడా లోకేష్ కు లేదని.. అప్పుడు పాదయాత్ర ఆపలేదు కానీ, చంద్రబాబు జైలుకెళ్తే మాత్రం పాదయాత్ర ఆపేశారని మండిపడ్డారు.
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అడవిలో జంతువులని వాళ్ల మధ్య సింహం జగన్ అని కామెంట్స్ చేశారు తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ లక్ష్మిపార్వతి. ఎంతమంది కలిసి వచ్చిన సింహాం లాంటి జగన్ ను ఏం చేయలేరని ధీమ వ్యక్తం చేశారు.
యువగళం విజయోత్సవ సభపై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ మొదలెట్టిన యుద్ధభేరితో సీఎం జగన్ చిటికెన వేలిని కూడా కదపలేరని కౌంటర్లు వేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఈరోజు ఆయన లోకేష్ పాదయాత్ర యువగళం ముగింపు సభకోసం విశాఖ రావాల్సి ఉంది. కానీ ఆయన ఆరోగ్య కారణాలతో సభకు గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సీఎం జగన్ కు టైం దగ్గర పడిందని అన్నారు లోకేష్. మరో మూడు నెలల్లో జగన్ పాలన అంతం కాబోతుందని పేర్కొన్నారు. జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు పూర్తయిందని అన్నారు. ప్రజా రాజధాని అమరావతి అజరామరమై నిలుస్తుందని తెలిపారు.