PM Modi: రేపు తెలంగాణకు మోడీ.. షెడ్యూల్ ఇదే!
రేపు తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభం, మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
రేపు తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. రేపు ఆదిలాబాద్, ఎల్లుండి సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రారంభం, మరికొన్ని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.
భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. గత కొంత కాలంగా తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ సీఎంను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మహబూబ్‌నగర్ టికెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న టీ-బీజేపీ ఉపాధ్యకురాలు డీకే అరుణకు షాకిచ్చింది బీజేపీ హైకమాండ్. ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలో ఆమె పేరును ప్రకటించలేదు. ఇందుకు కారణం మహబూబ్‌నగర్ టికెట్ కొరకు ముగ్గురు ముఖ్య నేతలు ఉండడమే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రానున్న లోకసభ ఎన్నికల్లో ప్రధాని మోదీ మరోసారి వారణాసి లోకసభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్ డే పోటీ ప్రకటించారు.లోకసభ ఎన్నికల కోసం 195 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ తన తొలి జాబితాను ప్రకటించింది.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. వారణాసి నుంచి ఎంపీగా మోడీ పోటీ చేయనున్నట్లు వినోద్ తావడే తెలిపారు. తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది.
తెలంగాణలో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో గెలుపే టార్గెట్‌గా పెట్టుకుంది కాంగ్రెస్. ఒక ఎంపీ అభ్యర్థిని సీఎం రేవంత్ ప్రకటించారు. మిగతా 16 స్థానాలపై కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. మరో రెండ్రోజుల్లో 8మందితో కూడిన మొదటి జాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు, ఖమ్మం క్యాడర్‌కు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం మారి 3 నెలలు గడుస్తున్నా పువ్వాడ దూరంగా ఉండడంతో ఖమ్మం బీఆర్ఎస్ క్యాడర్ అసంతృప్తిగా ఉంది. కార్యకర్తలు పార్టీని వీడుతున్నారు.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగబోతున్న అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ అధిష్టానం మరికాసేపట్లో విడుదల చేయనుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.