పాక్ లో మోగిన యుద్ధ సైరన్.. | India Pak War Updates | Pak War Siren | PM Modi vs Shehbaz Sharif |RTV
భారత నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులను కొనసాగిస్తూనే ఉంది. వాటిని భారత సైన్యం సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది. నిన్న అర్ధరాత్రి జమ్మూ, కాశ్మీర్ లోని కుప్వారా, అఖ్నూర్ దగ్గర ఫైరింగ్ చేసింది పాక్.
పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. భారత్ యుద్ధానికి రెడీ అవుతుండడంతో పాక్ జాగ్రత్తలు పడుతోంది. పీవోకేలో అత్యవసర ఆంక్షలు విధించింది. ఉద్యోగుల సెలవులు, ట్రాన్సఫర్లను నిలిపేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకొస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆక్రమన్ ఎక్స్ర్సైజ్ నిర్వహించింది. రెండు రాఫెల్ స్వ్కాడ్రన్లు ఇందులో పాల్గొన్నారు. లాంగ్ రేంజ్ అటాక్, శత్రు స్థావరాలపైన దాడి వ్యాయామాలు చేశారు.