Government Jobs: నిరుద్యోగులకు అలెర్ట్.. జాబ్ క్యాలెండర్ విడుదల!
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) 2024లో జరిగే రిక్రూట్మెంట్ పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది. సీజేఎల్ నోటిఫికేషన్ జూన్ 11, 2024న వస్తుంది. పరీక్ష సెప్టెంబర్లో జరుగుతుంది.
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (SSC) 2024లో జరిగే రిక్రూట్మెంట్ పరీక్షల క్యాలెండర్ను విడుదల చేసింది. సీజేఎల్ నోటిఫికేషన్ జూన్ 11, 2024న వస్తుంది. పరీక్ష సెప్టెంబర్లో జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. 3,282 ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఉన్న 18 యూనివర్సిటిల్లో మొత్తం 3, 282 అధ్యాపక పోస్టుల భర్తీకి అక్టోబర్ 20న ప్రకటన వెలువరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కే. హేమచంద్రారెడ్డి తెలిపారు. వీటితోపాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్ పై తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్కిల్ డెవలప్ మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళాలో 20కి పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ జాబ్ మేళా ద్వారా ఈ కంపెనీల్లో వెయ్యికి పైగా ఉద్యోగాలను కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మెగా జాబ్ మేళాను అక్టోబర్ 20వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 9.00గంటల నుంచి నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో సెలక్ట్ అయిన అభ్యర్థులు ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
ఐడీబీఐ...ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 600 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పరీక్ష, ఇంటర్వ్యూలతో రిక్రూట్ జరుగుతుంది. ఇందులో సెలక్ట్ అయిన వారు ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. అందులో రాణించినవారిని విధుల్లోకి చేర్చుకుంటారు. కోర్సులో ప్రతి నెలా స్టైఫెండ్ కూడా ఇస్తారు. అంతేకాదు ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదికి 6.5లక్షలు వేతనంగా చెల్లిస్తారు.
ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి్ంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు తెలుగు, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత కలిగి ఉంటారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఎస్బిఐలో పీవో పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. సెప్టెంబర్ 27తో ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ముగియనుండగా...అక్టోబర్ 3 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు కూడా ఉంటుంది. నవంబర్ లో ప్రిలిమ్స్, డిసెంబర్ లేదా 2024 జనవరిలో మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తారు.
నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. కొత్తగా ఏర్పడిన మెడికల్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్దతిలో 434 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను చూద్దాం.
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఎన్నికల హామీలో భాగంగా త్వరలోనే సూర్యపేటలో ఐటీ కొలువుల జాతరను నిర్వహించనున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 2న ఐటీ హబ్ ను ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్ టాస్క్ అధికారులతో మంత్రి జగదీశ్ రెడ్డి విడుదల చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి TREIPB నుంచి కీలక ప్రకటన వెలువడింది. పరీక్షకు హాజరైన అభ్యర్థఉలు సొసైటీ, జోనల్ వారీగా ఆప్షన్లు ఇవ్వాలని కోరింది. అభ్యర్థులు అన్ని సొసైటీలకు ఆప్షన్లు ఇస్తేనే పోస్టుల పోటీలో బలంగా నిలబడేందుకు అవకాశాలు ఉంటాయని, మెరిట్ ప్రాతిపదికన పోస్టులు దుక్కేందుకు చాన్స్ ఉంటుందని బోర్డు వెల్లడించింది.