Kumaraswamy : కుమారస్వామికి అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు
కేంద్రమంత్రి కుమారస్వామి అస్వస్థతకు గురయ్యారు. మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా ఆయనకు ముక్కు నుంచి ఆగకుండా రక్తస్రావం జరిగింది. దీంతో అక్కడున్న వారు వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.