Krishna Reddy: తిరిగి బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి?
కాంగ్రెస్లో చలమల కృష్ణా రెడ్డి చేరికపై గందరగోళం నెలకొంది. ఆయన చేరిక చెల్లదని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు అందెం సంజీవ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా చలమల కుట్రలు చేశారని ఆరోపణలు చేశారు. దీంతో ఆయన తిరిగి బీజేపీలో చేరుతారనే చర్చ జోరందుకుంది.