Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ పై కోమటిరెడ్డి సంచలన రియాక్షన్.. జెండాలు మోసిన అందరికీ..
ఈ రోజు విడుదలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి లిస్ట్ పై ఆ పార్టీ కీలక నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. మొదటి లిస్ట్ లో బీసీలకు 12 సీట్లు దక్కాయన్నారు. నెక్ట్స్ లిస్ట్ లో మరిన్ని సీట్లు లభిస్తాయన్నారు. బీఆర్ఎస్ కన్నా తామే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామన్నారు. టికెట్ రానివాళ్లంతా వచ్చిన వారితో పాటు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడి జెండాలు మోసిన అందరికీ పదవులు దక్కుతాయన్నారు.
Minister KTR: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్‌కు సిద్దం
ఎన్ని కుట్రలు చేసినా సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన.. కలలో కూడా ఊహించని విధంగా సూర్యాపేట జిల్లా అభివృద్ధి చెందిందన్నారు.
Komatiredy Vs Kancharla: నల్గొండలో హై టెన్షన్.. కోమటిరెడ్డి, కంచర్ల బల ప్రదర్శన !
నల్గొండలో హై టెన్షన్ నెలకొంది. ఇటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ..అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వర్గాలు బల ప్రదర్శన చేపట్టనున్నాయి. ఈ రెండు వర్గాలు ఒకేసారి గణేశుడి నిమర్జనానికి సిద్దమైయ్యాయి. దీంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
Kumbham Anil: కాంగ్రెస్ లోకి కుంభం అనిల్ కుమార్ రెడ్డి.. కోమటిరెడ్డితో సయోధ్య కుదిరిందా?
ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరనున్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
MP Komati Reddy Venkat Reddy: తన స్థానం త్యాగం చేస్తే.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం తాను నల్గొండ స్థానాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని ఎంపీ వివరించారు.
Komati Reddy Venkat Reddy: కాంగ్రెస్ 50 ఏళ్లలో ఏం చేసిందో తెలియదా..?
సీఎం కేసీఆర్‌పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రామలు చేపట్టలేదనడం సిగ్గు చేటన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు.
Gutta Sukhender Reddy: ఎంపీ వెంకట్‌రెడ్డిపై గుత్తా ఫైర్
ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పాలిటిక్స్ పీక్స్ లెవల్‌కు వెళ్లాయి. ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్లో అవినీతి ఎక్కువైపోయిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించగా.. ఎంపీ రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఇదే మంచి సమయమని గుత్తా ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తుంది- కోమటిరెడ్డి
రాష్ట్రంలో దళిత వర్గాల ప్రజలు అవమానానికి గురవుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇస్తామన్నారు