TS Politics: టార్గెట్ నల్గొండ.. కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఇదే! By Nikhil 01 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి తెలంగాణ కాంగ్రెస్ లో (Telangana Congress) దాదాపు అరడజను మంది ముఖ్యమైన నేతలు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే. గత ఎన్నికల సమయంలో వీరిపై ఫుల్ ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR) కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు ఓటమి పాలయ్యేలా వ్యూహాలు రచించారు. ఆయన వ్యూహం సక్సెస్ కావడంతో వీరిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినహా మిగతా నేతలంతో ఓటమి పాలయ్యారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి కూడా కోదాడలో ఓడిపోయారు. దీంతో జిల్లాలో కాంగ్రెస్ ఖతమైందని ప్రచారం జరిగినా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పరిస్థితి మళ్లీ మారిపోయింది. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి సత్తా చాటారు. అయితే.. అనంతరం జరిగిన హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ విజయం సాధించింది. ఇది కూడా చదవండి: Big Breaking: బీజేపీలోకి చలమల కృష్ణారెడ్డి.. రాజగోపాల్ రెడ్డిపై పోటీకి సై? అయితే.. ప్రస్తుత ఎన్నికల్లో జిల్లాలో మళ్లీ కాంగ్రెస్ కే హెడ్జ్ ఉంటుందన్న ప్రచారం సాగుతుండడంతో కేసీఆర్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ఇప్పటికే ఆశీర్వాద సభలను ఆయన పూర్తి చేశారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లోనూ త్వరలోనే కేసీఆర్ సభలకు ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. నల్గొండ, నకిరేకల్, సూర్యాపేట, నాగర్జున సాగర్ సీట్లపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నకిరేకల్ లో బీఆర్ఎస్ నుంచి వెళ్లిన వేముల వీరేశం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండగా.. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి బీఆర్ఎస్ తో తలపడుతున్నారు. ఇది కూడా చదవండి: Gajwel Constituency: పొలిటికల్ పార్టీలకు గజ్వేల్ వెరీ స్పెషల్.. ఆ సెంటిమెంటే కారణం..! సూర్యాపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. కాంగ్రెస్ అగ్రనేతలకు మరో సారి ఓటమి రుచి చూపించాలన్న లక్ష్యంతో కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. నల్గొండ, కోదాడ, హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో పలువురు ప్రజా ప్రతినిధులు చేరుతున్న వ్యవహారంపై సైతం కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై ఫోకస్ చేయాలని జిల్లా మంత్రితో పాటు రాష్ట్ర స్థాయి నేతలను కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, ఏపూరి సోమన్నను చేర్చుకున్న గులాబీ పార్టీ జిల్లాలో ఇతర పార్టీలకు చెందిన ముఖ్యులను కూడా తమవైపు తిప్పుకోవాలని గాలం వేస్తున్నట్లు సమాచారం. #telangana-elections-2023 #kunduru-janareddy #komati-reddy-venkat-reddy #cm-kcr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి