South Korea : మరోసారి రెచ్చిపోయిన కిమ్ ప్రభుత్వం... ఏకంగా అధ్యక్షుడి కార్యాలయం పైకే చెత్త బెలూన్లు!
దాయాదీ దేశాలైన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న చెత్త బెలూన్ల ఘర్షణ గురించి తెలిసిందే.తాజాగా ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంపైనే ఉత్తర కొరియా చెత్త బెలూన్లను జారవిడిచింది. అయితే... వీటివల్ల ఎలాంటి ప్రమాదమూ జరగలేదని మీడియా వెల్లడించింది.