KCR Missing: కేసీఆర్ కనబడుటలేదు.. హైదరాబాద్లో వెలిసిన పోస్టర్లు!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కనబడుటలేదంటూ హైదరాబాద్ నగరంలో పోస్టర్లు వెలిశాయి. 'రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో నానా ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్' అంటూ పోస్టర్లలో రాసుకొచ్చారు. ప్రస్తుతం పోస్టర్లకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.