అలా అడిగినందుకే ఇంటర్ విద్యార్థినిని చంపేశాడు: ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
వైఎస్సార్ జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థిని పెట్రోల్ దాడికి గురై ఆదివారం మృతి చెందింది. ఆ బాలిక పెళ్లి చేసుకోవాలని అడిగినందుకే విఘ్నేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు వెల్లడించారు. వారిద్దరికీ ఐదేళ్లుగా పరిచయం ఉందని అన్నారు.
నేరస్తుడికి మరణశిక్ష పడాలి: చంద్రబాబు ఆగ్రహం
కడప జిల్లా బద్వేలులో పెట్రోల్ దాడిలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ప్రత్యేక కోర్టులో ఫాస్ట్ ట్రాక్ విధానంలో ఈ కేసు విచారణ పూర్తి చేసి నేరస్తుడికి మరణశిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించానన్నారు.
పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి!
AP: బద్వేల్లో పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచింది. శనివారం విద్యార్థినిపై ప్రేమోన్మాది విఘ్నేశ్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
మంచం కింద డిటోనేటర్లు పేల్చి .. సినిమా లెవెల్లో వీఆర్ఏ హత్య
మంచం కింద డిటోనేటర్లు పెట్టి సినిమా లెవెల్లో వీఆర్ఏను హత్య చేసిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వీఆర్ఏ స్పాట్లో మరణించగా.. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వివాహహేతర సంబంధం వల్ల బాబు అనే వ్యక్తి హత్య చేశాడని పోలీసులు విచారణలో తెలిపారు.