ఉమ్మడి కడప జిల్లాలో.. ఘోర రోడ్డు ప్రమాదం
కడప జిల్లాలోని పులివెందుల మండలం ఉలిమెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారు జామున ఎదరెదురుగా వచ్చిన రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో నలుగరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు గోటురు గ్రామం ఓబుల్ రెడ్డిగా గుర్తించారు.