Big Breaking: తెలంగాణలో పోటీకి జనసేన సై.. 32 స్థానాలతో లిస్ట్ రిలీజ్!
రానున్న తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు తాము పోటీ చేయబోయే స్థానాల లిస్ట్ ను విడుదల చేశారు.
రానున్న తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు తాము పోటీ చేయబోయే స్థానాల లిస్ట్ ను విడుదల చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మౌనదీక్ష చేశారు. ఏపీలో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా రెండు గంటల పాటు ఆయన దీక్ష చేపట్టారు. ఆయనకు సంఘీభావంగా నాదెండ్ల మనోహర్, ఇతర జనసేన నేతలు కూడా దీక్షలో కూర్చున్నారు. మౌన దీక్ష అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున చంద్రబాబు నిరాహార దీక్ష చేయడాన్ని చూసి గాంధీజీ ఆత్మ క్షోబిస్తోందన్నారు. అవినీతి కేసులో జైల్లో ఉన్న చంద్రబాబు దీక్ష చేయడం సిగ్గుచేటన్నారు.
కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర కొనసాగిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఒక్క మంచి లక్షణం కూడా లేదన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారయింది. వచ్చే నెల అక్టోబర్ 1నుండి పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహి యాత్ర సార్ట్ కానుంది. రాష్ట్రంలోని తాజా పరిణామాలతో జనసేనాని దూకుడు పెంచారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడానికి జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తూ జనసైనికుల్లో జోష్ పెంచుతున్నారు.
2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, ఎన్నికల్లో ఓడినా అనతికాలంలోనే తన పోరాట కార్యక్రమాలతో జనసైనికుల్లో రాష్ట్ర వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు.
లోక కల్యాణం కోసం అవసరం అయితే తన సీటు కూడా జనసేనకు ఇవ్వాలని చంద్రబాబుకు సూచించినట్లు ఏపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు.