మీకెన్ని..? మాకెన్ని..?.. సీట్ల లెక్క తేల్చనున్న టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ..
ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో రాష్ర్టంలో రాజకీయ పార్టీలు స్పీడు పెంచాయి. ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించాయి. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని ప్రకటించిన టీడీపీ-జనసేన పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాయి. సీట్ల పంపకాలు, నాయకుల మధ్య సమన్వయం కోసం ఇరు పార్టీలు కమిటీలను ఏర్పాటు చేశాయి. టీడీపీతో సమన్వయం కోసం నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో గతంలోనే జనసేన పార్టీ కమిటీని ఏర్పాటు చేసింది.