ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు!
జనసేన పార్టీ పెట్టే సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడ్డాం అని పేర్కొన్నారు. జనసేనలో చేరేందుకు చాలా మంది వస్తున్నారని తెలిపారు.
జనసేన పార్టీ పెట్టే సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడ్డాం అని పేర్కొన్నారు. జనసేనలో చేరేందుకు చాలా మంది వస్తున్నారని తెలిపారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో నష్టపోయిన మత్స్యకారులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. బాధిత మత్స్యకారులకు రూ.50 వేలు చొప్పున చెక్కులు అందించారు. ఇలా డబ్బులు ఇస్తోంది నేనున్నానే భరోసా కల్పించడానికే కానీ ఎన్నికల కోసం కాదని స్పష్టం చేశారు.
ఆంధ్ర తనకు జన్మనిస్తే, తెలంగాణ పునర్జన్మనిచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ అంతటా పర్యటిస్తానన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టాలని కోరారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలోని పవన్ కల్యాణ్ ఎంటర్ కానున్నారు. ఈ నెల 25 నుంచి 3 మూడు రోజులు పలు నియోజకవర్గాల్లో బీజేపీ, జనసేన అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయనున్నారు. పవన్ తన ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పై ఎలాంటి పంచ్ లు పేలుస్తారన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ రోజు స్పెషల్ ఫ్లైట్‌లో కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు సాయంత్రం అమిత్ షా, జేపీ నడ్డాను ఆయన కలిసి తెలంగాణ ఎన్నికల్లో పొత్తులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి పదవి పట్ల తనకేమీ విముఖత లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీఎం పదవి వరిస్తే.. తీసుకోవడానికి తనకెలాంటి అభ్యంతరం లేదంటున్నారు. పవన్ చేసిన ఈ కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి. ఇప్పటికే సీట్ల విషయంలో పట్టు బిగించాల్సిందే అంటూ జనసేన నేతల నుండి ఒత్తిడి వస్తుండగా.. సీఎం పదవి విషయంలోనూ పవన్ వెనక్కి తగ్గొద్దని ఆ పార్టీ సీనియర్లు సూచిస్తున్నారట.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ ప్రభంజనం తగ్గిందనీ, అదే సమయంలో వారాహి యాత్రతో జనసేన క్రేజ్ పెరిగిందని, ఇలాంటి సమయంలో సీట్ల విషయంలో వెనక్కి తగ్గొద్దని జనసేన అధినేత పవన్‌కు ఆ పార్టీ సీనియర్ల నుండి ఒత్తిడి ఎదురవుతోంది. అయితే, గతంలో 30 సీట్ల దాకా ఉన్న అంచనాలు ప్రస్తుతం టీడీపీకి మైలేజ్ తగ్గిన పరిస్థితుల్లో మరింతగా పెరుగుతున్నాయి. కనీసం 50 సీట్లకు తగ్గకూడదని జనసేన నేతల నుండి డిమాండ్ వినిపిస్తోంది.
టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది . ఈ నెల 23న రాజమండ్రిలో తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జేఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికల దిశగా ఉమ్మడి కార్యాచరణ, ఇరు పార్టీల మధ్య సమన్వయం కుదర్చడం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకొనున్నారు.
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి నారా బ్రాహ్మణి, భువనేశ్వరి భర్తలను మించిన భార్యలంటూ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాన్ పిచ్చోడు, అమాయకుడంటూ తీవ్ర వాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి.