Dussera 2023: దసరా రోజు జమ్మి చెట్టుని ఎందుకు పూజిస్తారు...పాలపిట్టను ఎందుకు చూడాలి!
విజయాలు సిద్ధించిన రోజు జరుపుకునే పండుగ రోజున దేవతా వృక్షమైన జమ్మి చెట్టును పూజించటం ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ చెట్టును శమీ వృక్షం అని కూడా పిలుస్తారు. కేవలం పండుగ రోజే కాదు.జమ్మి చెట్టును వివాహాలు , గృహాప్రవేశాల సమయంలో కూడా పూజిస్తారు.