కోడి కత్తి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా!
కోడి కత్తి కేసు విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 23 కి వాయిదా వేసింది. ఆరోజేనే తమ వాదనలు వినిపిస్తామని నిందితుడు శ్రీను తరుఫున న్యాయవాది సలీం పేర్కొన్నారు.
కోడి కత్తి కేసు విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 23 కి వాయిదా వేసింది. ఆరోజేనే తమ వాదనలు వినిపిస్తామని నిందితుడు శ్రీను తరుఫున న్యాయవాది సలీం పేర్కొన్నారు.
చచ్చేంత వరకు సీఎం జగన్ తోనే ఉంటానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 175 సీట్లు గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కి కూడా వాటా ఉందని ఆరోపించారు.
చంద్రమోహన్ మృతిపట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చంద్రమోహన్ చెరగని ముద్ర వేశారంటూ కేసీఆర్, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళి అర్పిస్తున్నారు.
అనకాపల్లి జిల్లాలో పోలీసులు రెచ్చిపోయి ప్రవర్తించారు. ఐడీ కార్డు చూపించమని అడిగినందుకు ఓ సైనికుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. పరవాడ సంతలో చోటుచేసుకున్న ఈ ఘటన పెను సంచలనం సృష్టిస్తోంది.
జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిల్ మీద తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ చేసింది. హరి రామ జోగయ్య పిల్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించడమే కాక ప్రతివాదులు జగన్, సీబీఐకి నోటీసులు పంపాలని చెప్పింది.
ఓటర్ల జాబితాలో తన ఐడీని చూసి ఓ మహిళ అవాక్కైంది. ఆమె స్థానంలో ఏకంగా సీఎం జగన్ ఫొటో రావడం చూసి షాక్ అయింది. ప్రస్తుతం ఈ టాపిక్ ఏపీలో చర్చనీయాంశంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి మాట్లాడుతున్నారా లేక తన బావ చంద్రబాబు ఉనికిని కాపాడాటానికి ఆమె మాట్లాడుతున్నారా అంటూ బాపట్ల ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు ప్రశ్నించారు.
జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని లోకేశ్ ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలో యువకుడు శ్యామ్ కుమార్ ను చిత్రహింసలు పెట్టడమేగాక..మంచినీళ్లు అడిగితే మూత్రం పోసి అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు.
సుప్రీంకోర్టులో జగన్కు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్కు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జనవరికి వాయిదా వేసింది.