YCP MLA: జగన్ కి షాక్ ..టీడీపీ గూటికి పెనమాలూరు ఎమ్మెల్యే!
వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీ గూటికి చేరుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతలు సారథిని కలిసి మాట్లాడారు.
వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వైసీపీ కి గుడ్ బై చెప్పి టీడీపీ గూటికి చేరుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతలు సారథిని కలిసి మాట్లాడారు.
కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ ఆయనను పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోందని, కనీసం పొటాటోకి టామాటా తేడా తెలియని వ్యక్తి మనల్ని పాలిస్తున్నాడు. అతి త్వరలోనే టీడీపీ ప్రభుత్వం వస్తుందని బాబూ తిరువూరులో జరిగిన బహిరంగ సభలో తెలిపారు.
పునాది స్థాయి అక్షరాస్యతలో ఏపీ కేరళను అధిగమించి అగ్రస్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. దేశంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలవడంతో జగన్ ప్రభుత్వం గర్విస్తోందని తెలిపారు.
అంగన్వాడీలకు జగన్ సర్కార్ షాక్ ఇచ్చింది. వారిపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. విధులకు హాజరుకాకపోవడంతో వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది.
వైసీపీ కి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ సారి ఎన్నికల్లో టికెట్ తన కుమారుడు రాఘవకు అడగగా అధిష్టానం నుంచి సమాధానం రాకపోవడంతో..ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
రాష్ట్రంలో సామాజికంగా , ఆర్థికంగా, రాజకీయంగా బీసీలను పైకి తీసుకుని వచ్చే బాధ్యత టీడీపీదేనని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బీసీ సోదరుల జోలికి వచ్చే ధైర్యం కూడా ఎవ్వరూ చేయకూడదనే టీడీపీ మేనిఫెస్టోలో కూడా బీసీ రక్షణ చట్టం చేస్తామని హామీనిచ్చినట్లు తెలిపారు.
వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు. జనవరి 4న షర్మిల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ విషయాన్ని YSRTP ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.