Big News: చంద్రుడిపై ప్రకంపనలు..అచ్చం భూకంపం లాగానే.. గుర్తించిన చంద్రయాన్-3!
జాబిల్లి ఉపరితలంపై ప్రయోగాలు చేస్తున్న చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. జాబిల్లిపై ప్రకంపనలను ఇస్రో పరిశోధనలు గుర్తించాయి. ప్రజ్ఞాన్ రోవర్‌తో పాటు ఇతర పేలోడ్ల ఆధారంగా జాబిల్లిపై ప్రకంపనలు గుర్తించినట్టు ఇస్రో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. లూనార్ సీస్మిక్ యాక్టివిటీ (ILSA) పేలోడ్ ఈ ప్రకంపనలు రికార్డ్ చేసింది.