కాలిపోతున్న ఇజ్రాయిల్ | Israel vs Iran War | Iran Attacks Israel | War Update | RTV
గాజాపై ఇజ్రాయెల్ మిస్సైల్స్, రాకెట్లతో విరుచుకుపడుతోంది. మంగళవారం గాజాలోని రెండు పెద్ద అపార్ట్మెంట్స్పై దాడి చేయగా ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఈ దాడిలో 100 మందికిపైగా మృతి చెందగా.. 200 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావరణంతో తెలుగు పౌరులు బిక్కుబిక్కుమంటున్నారు. డ్రోన్లు, మిస్సైల్స్‌తో ఇజ్రాయెల్ పై ఇరాన్ విరుచుకుపడుతోంది. తమ జోలికొస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. దీంతో తెలుగు ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ల మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణం ఇంకా చల్లారలేదు. ఇరు దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాజాగా కేరళ మహిళల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన సబిత, మీరా మోహన్ అనే ఇద్దరు మహిళలు ఇజ్రాయెల్‌లో కేర్ గీవర్లుగా పనిచేస్తున్నారు.
మియా ఖలీఫా.. పాలిస్తానాకు సపోర్ట్ చేస్తూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇజ్రాయిల్‌పై దుమ్మెత్తిపోసింది. అయితే, ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక పాలస్తీనాకు సపోర్ట్ చేసిన నేపథ్యంలో.. పలు వ్యాపార సంస్థలు మియా ఖలీఫాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి.
యుద్ధాన్ని మేం మొదలు పెట్టలేదు కానీ, ముగించేది మేమే అంటూ ఇజ్రాయెల్ ప్రధాని హమాస్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. యుద్దం మొదలు పెట్టి హమాస్ చారిత్రక తప్పిదం చేసిందని వ్యాఖ్యనించారు. ఇజ్రాయెల్ ప్రతిదాడి శత్రుదేశాలకు దశాబ్దాల పాటు గుర్తుండిపోతుందని హెచ్చరిక చేశారు. హమాస్ మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. ఇజ్రాయిల్, పాలస్తీన మధ్య భీకరపోరు జరుగుతోంది. గాజాపై ఇప్పటి వరకు 5 వేల బాంబులు పేల్చారు. నిన్న ఒక్క రోజే 2400 బాంబు దాడులు చేశారు. ఈ యుద్ధంలో దాదాపు1,500 మందికి పైగా ఇజ్రాయిలీలు, పాలస్తీనియన్లు చంపబడ్డారు.
ఇజ్రాయేల్-పాలస్తీనా మధ్య జరుగుతున్న పోరు భీకర స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు ఇరు వైపుల ఉంచి 298 మంది మరణించినట్టు సమాచారం. 20 నిమిషాల్లో దాదాపు 5వేల రాకెట్లతో దాడి చేసిన హమాస్ మరోసారి 150 రాకెట్లతో విరుచుకుపడడంతో ఇజ్రాయేల్ దెబ్బకు దెబ్బ కొట్టాలని కాపు కాచుకోని కూర్చోంది. హమాస్ చీఫ్ ఇంటిపై ఇజ్రాయేల్ దాడి చేసినట్టు సమాచారం.