Israel Vs Iran War | అణుబాంబ్ .. గుట్టలుగా శవాలు | Iran Ready Nuclear Bomb Attack On Israel | RTV
హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ భయంకర విధ్వంసానికి పాల్పడుతోంది. హసన్ నస్రల్లాను హతమార్చేందుకు 85 బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. ఇవి 30 నుంచి 60 అడుగుల భూగర్భంలో ప్రభావం చూపిస్తాయి. వియత్నాం యుద్ధంలో ఎక్కువగా వీటిని ఉపయోగించారు.
ఎవరేం చెప్పినా వినొద్దు...ఫుల్ ఫోర్స్‌తో దాడి చేయండి...హెజ్బుల్లా నాశనమే మన లక్ష్యం మన అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాలు ఇచ్చిన పిలుపును ఆయన పక్కన పెట్టేశారు.
ఎలక్ట్రానిక్ పరికరాల మీద దాడ అయిపోయింది ఇప్పుడు ప్రత్యక్ష దాడులతో హెజ్బుల్లా మీద విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. హెజ్బుల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పింది.
యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు తమ హైపర్సోనిక్ క్షిపణిని నూతనంగా ఆవిష్కరించారు.ఈ కొత్త క్షిపణి పేరు పాలస్తీనా-2. ఈ క్షిపణి గరిష్ఠ వేగం గంటకు 19756 కి.మీ. దీని పరిధి 2150 కి.మీగా నిపుణులు నిర్థారించారు.
యెమెన్‌లో హౌతీల స్థావరాలే లక్ష్యంగా అల్ హొదైదా నౌకాశ్రయంతోపాటు పలు లక్ష్యాలపై ఇజ్రాయిల్ బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో పలువురు మరణించగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. నౌకాశ్రయంలో ఉన్న చమురు నిల్వలకు మంటలు అంటుకున్నాయి.