IND VS AUS: విశాఖలో మ్యాచ్ అంటే ఆ మజానే వేరు.. ఇలాంటి అనుభూతి ఎక్కడా రాదు!
ప్రస్తుతం విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. వైజాగ్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ20 ఫైట్ కోసం సాగర నగర తీర అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. వైజాగ్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ20 ఫైట్ కోసం సాగర నగర తీర అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా రెడీ అయ్యింది. విశాఖ వేదికగా రేపు తొలి టీ20 జరగనుండగా అందరిచూపు తెలుగుకుర్రాడు తిలక్వర్మపైనే పడింది. అటు రింకూ సింగ్ ఎలా ఆడుతాడన్నదానిపై కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమికి టీమిండియా దూకుడుగా బ్యాటింగ్ చేయకపోవడమే కారణమన్నాడు గంభీర్. కోహ్లీ యాంకరింగ్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు కేఎల్ రాహుల్ వేగంగా ఆడకుండా స్లోగా బ్యాటింగ్ చేయడం కొంపముంచిందన్నాడు.
వరల్డ్‌కప్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు 'షూ'లో షాంపైన్ పోసుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఏడాది వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత సంబరాల వీడియో కాదు.. 2021 నాటిది.
పనౌటి(అన్‌లక్) అనే ట్యాగ్‌ను ఫన్నీగా మోదీకి అంటగట్టింది కాంగ్రెస్. వరల్డ్‌కప్ ఫైనల్‌ను మోదీ స్టేడియానికి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించగా.. మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయింది. మన కుర్రాళ్లు మ్యాచ్ గెలిచేవారని.. కానీ మోదీ ఓడిపోయేలా చేశారని రాహుల్‌గాంధీ రాజస్థాన్ సభలో సెటైర్లు వేశారు.
ఆస్ట్రేలియా టీమ్‌తో తాను ఎక్కువగా కనెక్ట్ అయ్యానంటూ జూనియర్ ఎన్టీఆర్ గతంలో చెసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఆరోసారి గెలుచుకున్న విషయం తెలిసిందే. తారక్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్‌ను ఓ ఎన్టీఆర్ ఫ్యాన్ షేర్ చేయగా..అది వైరల్‌గా మారింది.
వరల్డ్‌కప్ ఫైనల్లో ఇండియాపై ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్ చెలరేగిన విషయంతెలిసిందే. దీంతో హెడ్ భార్య, ఏడాది వయసున్న కూతురుపై కొందరు అసభ్యకర కామెంట్స్ చేశారు. అటు మ్యాక్స్‌వెల్ భార్యను సైతం ట్రోల్ చేశారు. దీంతో ఇన్‌స్టా వేదికగా మ్యాక్సీ భార్య వినీ ట్రోలర్స్‌పై రివర్స్ అటాక్‌కు దిగారు.
అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇది ఆరో ట్రోఫీ.
మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా స్లోగా బ్యాటింగ్ చేస్తోంది. దీంతో బౌండరీ రావడమే గగనమైపోయింది. స్టేడియంలో లక్షా 30వేల మంది సైలెంట్‌గా ఉండిపోయారు. లక్షల మందిని సైలెన్స్‌గా ఉంచితే అంతకంటే వచ్చే సంతృప్తి అసలు ఉండదు అన్న కమ్మిన్స్ మాటలను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.