India's billionaire: చరిత్రలో తొలిసారి.. 300 దాటిన భారత బిలియనీర్ల సంఖ్య!
భారతదేశ బిలియనీర్ల సంఖ్య చరిత్రలో తొలిసారిగా 300 దాటింది. 'హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024' ప్రకారం భారతదేశంలో ప్రస్తుతం 334 మంది బిలియనీర్లు ఉన్నట్లు తేలింది. 13 ఏళ్లలో భారతదేశ సంపద గ్లోబల్ బెంచ్‌మార్క్‌లను మించిపోగా ఆరు రెట్లు పెరిగినట్లు సదరు సంస్థ వెల్లడించింది.