India Alliance: కొనసాగుతున్న వాయిదా పర్వం.. ఇండియా కూటమి నాలుగో బేటీ అప్పుడే!
ఇండియా కూటమి సమావేశం మరోసారి వాయిదా పడింది. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించాలని భావించి కూటమిలోని అన్ని పక్షాలూ సమావేశం కావాలని నిర్ణయించాయి. మొదట డిసెంబరు 6న సమావేశానికి నిర్ణయించగా 17కు వాయిదా వేశారు. తాజాగా అది 19కి వాయిదా పడింది.