India Alliance: కొనసాగుతున్న వాయిదా పర్వం.. ఇండియా కూటమి నాలుగో బేటీ అప్పుడే! ఇండియా కూటమి సమావేశం మరోసారి వాయిదా పడింది. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించాలని భావించి కూటమిలోని అన్ని పక్షాలూ సమావేశం కావాలని నిర్ణయించాయి. మొదట డిసెంబరు 6న సమావేశానికి నిర్ణయించగా 17కు వాయిదా వేశారు. తాజాగా అది 19కి వాయిదా పడింది. By Naren Kumar 10 Dec 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి India Alliance: ఇండియా కూటమిలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఓటమి నేపథ్యంలో సమీక్ష కోసం సమాలోచనలు చేయాలని కూటమిలోని అన్ని పక్షాలు భావించాయి. ఇందుకోసం సమావేశం కావాలని ముందుగా నిర్ణయించుకోగా, అది వాయిదా పడింది. ఈ నెల 17న నిర్ణయించిన సమావేశం మరోసారి వాయిదా పడింది. ఆ సమావేశాన్ని 19వ తేదీకి వాయిదా వేసినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. అయితే, అందుకు కారణాలను మాత్రం చెప్పలేదు. ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో స్పీకర్‌గా రమణ్ సింగ్.. ఇద్దరికి డిప్యూటీ సీఎం పదవులు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలవడంతో ఆ వెంటనే ఈ నెల 6వ తేదీన ఇండియా కూటమి సమావేశం కావాలని నిర్ణయించింది. అయితే, బిహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సహా కూటమిలోని అగ్రనేతలు సమావేశానికి హాజరు కాలేమని చెప్పడంతో డిసెంబర్ 17కు వాయిదా వేశారు. ప్రస్తుతం ఉత్తరాదిలో ఒక్క హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే కాంగ్రెస్ సొంతంగా అధికారంలో ఉంది. బీహార్, జార్ఖండ్‌లలో అక్కడి స్థానిక పార్టీలతో పొత్తు సాయంతో అధికారం కొనసాగిస్తోంది. దేశం మొత్తం మీద కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌లో మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించి అధికారం కైవసం చేసుకుంది. బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమి మొదటిసారి పాట్నాలో సమావేశమైంది. అనంతరం బెంగళూరు, ముంబయిల్లో బేటీ అయ్యింది. ఇప్పటి దాకా మొత్తం మూడు సమావేశాలు జరిగాయి. నాలుగో సమావేశం వాయిదాలు పడుతూ వస్తోంది. తాజాగా మరోసారి ఈ నెల 17కు వాయిదా పడింది. #india-alliance-meeting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి