Telangana : తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు!
తెలంగాణ వాసులకు వాతావరణశాఖ ఓ చల్లటి వార్త చెప్పింది. రానున్న నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొన్నారు.