ఇదేందయ్యా సామీ..పగలంతా ఉక్కపోత..రాత్రంతా గజగజ చలి..తెలంగాణలో విచిత్ర వాతావరణం..!!
తెలంగాణలో ప్రస్తుతం విచిత్ర వాతావరణం నెలకొంది. పగలు వేడి..రాత్రంతా చలి గజగజ వణికిస్తోంది. ఈ విచిత్ర వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం విచిత్ర వాతావరణం నెలకొంది. పగలు వేడి..రాత్రంతా చలి గజగజ వణికిస్తోంది. ఈ విచిత్ర వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు. ఢిల్లీ (Delhi) తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.
తెలుగురాష్ట్రాల్లోనే కాదు..దేశవ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. రానున్న రెండు మూడు రోజులు దేశంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఏపీ, కర్నాటక, యూపీ, రాజస్తాన్, కేరళ తోపాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దేశరాజధానిలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు అయినప్పటికీ..రానున్న 24గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం నాడు కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ ప్రకటించింది.
ఏపీలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది వెదర్ డిపార్ట్ మెంట్. సగటు సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి పశ్చిమ మధ్య బంగాళా ఖాతంపై ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉంది. దీనికి తోడు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఒక ద్రోణి అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగుతుంది. ఈ ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.