14 గంటల్లో 800 సార్లు భూకంపం.. ఆ దేశంలో ఆగమాగం
వరుస భూ ప్రకంపనలతో ఐస్‌లాండ్ వణికిపోతోంది. రెక్జానెస్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం సుమారు 14 గంటల వ్యవధిలో 800 సార్లు ప్రకంపనలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజల రక్షణార్థం అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు తెలిపారు.