చంద్రముఖి 2 ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్..ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..
పద్దెనిమిదేళ్ల క్రితం రిలీజైన థియేట్రికల్ మూవీ చంద్రముఖి లకలకలక గుర్తుందిగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఈ మూవీ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో తిరుగులేని మార్కెట్‌ను తెచ్చిపెట్టింది.అప్పట్లో మన స్టార్ హీరోలే పాతిక కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టడానికి నానా తంటాలు పడుతుంటే సూపర్‌స్టార్ మాత్రం సింగిల్‌హ్యాండ్‌తో పాతిక కోట్ల మార్క్‌ను టచ్ చేసిబాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాడు.అంతలా ఈ మూవీ సంచలనాలను క్రియేట్ చేసింది. అయితే అదే సీక్వెల్లో వస్తున్న మూవీపై ఫ్యాన్స్ గుర్రుమీదున్నారు. సోషల్‌మీడియా వేదికగా తెగ ట్రోల్స్ చేస్తున్నారు.