నెల్లూరు జిల్లాలో 2 రోజులుగా కుండపోత
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 26 గేట్ల నుండి నీటి విడుదల చేశారు.16 గేట్లు 10 అడుగుల మేర.. 10 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,60,691 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
నాగార్జున సాగర్‌కు భారీ వరద పోటెత్తింది. 24 గంటల్లో 30 టీఎంసీల వరద సాగర్‌లోకి వచ్చి చేరింది. వరద ఇలాగే కొనసాగితే రెండు రోజుల్లో గేట్లు ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో సాగర్ అందాలు చూసేందుకు జనం క్యూ కడుతున్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద పెరిగింది. ఇన్ ఫ్లో 4,91,602, ఔట్ ఫ్లో 30,886 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 545.20 అడుగులు వద్ద ఉంది. ప్రాజెక్ట్ ఎడమ కాల్వకు నేడు సాగునీటిని విడుదల చేయనున్నారు.