Health Tips : బరువు తగ్గాలంటే..ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ పని చేయండి..!!
నెయ్యి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం ఎందుకు ప్రభావవంతంగా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
నెయ్యి తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు జరుగుతుంది. అయితే, ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం ఎందుకు ప్రభావవంతంగా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
డయాబెటిస్‌కు శాశ్వత నివారణ లేదు. దానిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అవసరం. కొన్ని పండ్లు మధుమేహ రోగులకు హానికరం అని భావిస్తారు, కొన్ని పండ్లు మేలు చేస్తాయి. షుగర్ పేషంట్లకు అవసరమైన పోషకాలు వాటిలో కనిపిస్తాయి. తాజా పండ్లను తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరగడమే కాకుండా అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఇది మాత్రమే కాదు, ఉప్పు తినకుండా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. తగినమోతాదులో తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు..కానీ మోతాదుకు మించి వాడినట్లయితే...అనేక సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. అదే విధంగా తక్కువ ఉప్పు తినడం వల్ల డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. కానీ ఉప్పు తక్కువగా తినడం వల్ల కలిగే అనర్ధాల గురించి తెలుసుకుందాం.
స్త్రీ తన కటి ప్రాంతంలో వాపు, నొప్పిని ఎదుర్కొంటుంటే.. లేదా టాయిలెట్‌కు వెళ్లేటప్పుడు నొప్పి, ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే.. శరీరం దిగువ భాగంలో భారంగా అనిపిస్తుంటే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే.. వైద్యులను సంప్రదించాలి. మొహమాటం, బిడియంతో సమస్యను అలాగే దాచిపెట్టొద్దు. ఎందుకంటే.. అది అనేక సమస్యకు కారణం అవుతుంది. ఇది గర్భాశయ క్యాన్సర్ కారకం కూడా కావొచ్చు అని చెబుతున్నారు నిపుణులు.
వాతావరణంలో మార్పుల కారణంగా..వైరల్, బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్లు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రతిఒక్కరూ దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు. అక్టోబర్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణంలో మార్పుల కారణంగా ఎంతో మంది రోగాల బారిన పడ్డారు. ఇప్పుడు చలి కూడా మొదలుకానుంది. అందువల్ల చాలా మందిలో వైరల్, ఫ్లూ, కళ్లు,ముక్కు, దగ్గు వంటి సమస్యలు పెరుగుతాయి. నిజానికి బలహీనమైన రోగనిరోధకశక్తి ఉన్నవారిలో ఇలాంటి వ్యాధులు వెంటనే ప్రభావం చూపిస్తాయి. రోగనిరోధక వ్యవస్థ బయటి సూక్ష్మ క్రిములను శరీరంలోకి ప్రవేశించనివ్వదు. కానీ వాతావరణంలో మార్పులు, గాలిలో తేమ పెరిగిన వైరస్ లు, బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిపై దాడి చేస్తాయి. అయితే వీటిని నివారించేందుకు పండ్లు ఎంతో సహాయపడతాయి.
పూర్వ కాలంలో మాత్రం అరిటాకు లేనిదే భోజనం చేసేవారు కాదు. అరిటాకులో భోజనం చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు పెద్దవారు. అరిటాకులో ఎక్కువగా ఫాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
నేటికాలంలో మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది. శరీరంలోని ఏదైనా ముఖ్యఅవయవం దెబ్బతింటే అది ఊపిరితిత్తులపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే మీ తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఎలాంటి ఫుడ్స్ తింటే ఊపిరితిత్తులు భద్రంగా ఉంటాయో తెలుసుకుందాం.
కోవిడ్ మహమ్మారి కాలం నుంచి ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం..ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి వాటిపై శ్రద్ద పెడుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ అనేది మరింత పెరిగింది. చాలామంది రాత్రి అన్నం తినడం మానేసి చపాతీలు, టిఫిన్లు తింటున్నారు. అయితే రాత్రి సమయంలో చపాతీ తినేవారికి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో చూద్దాం.
వరల్డ్ హార్ట్ డే ద్వారా ప్రజలకు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది డబ్ల్యూహెచ్ఓ. గత కొన్నేళ్లుగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే ఉన్నట్లుండి కుప్పకూలిపోతున్నారు జనాలు. అందుకే గుండె జబ్బులు రాకుండా మంచి జీవనశైలిని పాటించాలని సూచిస్తున్నారు నిపుణులు.