Lifestyle: రాత్రి బాగా నిద్రపోయిన తరువాత మరుసటి రోజు అలసిపోయినట్లు అనిపిస్తుందా? కారణం ఇదే..!
చాలా మంది రాత్రి బాగానే నిద్రపోయినా.. మరుసటి రోజు నిద్ర లేవగానే అలసటగా ఉంటారు. నీరసంగా భావిస్తారు. ఇదే విషయమై తాజాగా న్యూమిస్లీప్ సర్వే నిద్ర గురించి కీలక వివరాలు వెల్లడించింది. నిద్రపోయి.. మరుసటి రోజు లేచిన తరువాత నీరసంగా ఉండటానికి కారణం సెల్ ఫోన్ వినియోగమేనని చెప్పింది సర్వే. అర్థరాత్రి వరకు సెల్ ఫోన్ వినియోగించడం వల్ల నిద్రపై ప్రభావం చూపుతుందన్నారు.