Parrot Fever: చిలుకల నుంచి సోకుతున్న జ్వరం.. జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యం గల్లంతే!
యూరప్‌ను చిలుక జ్వరం కలవరపెడుతోంది. ఈ బ్యాక్టీరియా ప్రధానంగా చిలుకల లాంటి పక్షులకు సోకుతుంది. వాటి రెట్టల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. పెంపుడు పక్షులతో పనిచేసే కార్మికులు, వైద్యులు, పక్షుల యజమానులు జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.