Israel-Hamas War: హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాలని భారత్‌ను కోరిన ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తున్న వేళ.. భారత్ తమకు మద్దతు ఇవ్వడంపై ఇజ్రాయెల్ రాయబారి హర్షం చేశారు. ఇప్పుడు భారత్ కూడా హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నానని అన్నారు. అయితే ఇది ఒకరు ఒత్తిడి తెచ్చే అంశం కాదని.. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు, ఇతర వ్యూహాత్మక విషయాల్లో ఇజ్రాయెల్-భారత్ ఒకే రకమైన అభిప్రాయాలతో ఉన్నాయని చెప్పారు.