Joe Biden: హమాస్ దాడులపై మెజార్టీ పాలస్తీనియన్లకు సంబంధం లేదు.. జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు
ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న భీకర దాడులపై అమెరికా అధ్యక్షుడు జో బైడైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ మిలిటెంట్లు చేపట్టిన దాడిలో మెజారిటీ పాలస్తీనియన్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వారు చేసిన దాడుల వల్ల ఆ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన ట్విట్టర్లో పోస్టు పెట్టారు.