Israel Attacks: ఎదురుతిరగడంతో యువతిని కాల్చిన కిరాతకులు..ఇజ్రాయెల్లో ఇంత దారుణమా..!(వీడియో)
ఇజ్రాయెల్లో అతి దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూస్తే అక్కడ పరిస్ధితులు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్ధమవుతోంది. ఐదుగురు కుటుంబ సభ్యులున్న ఓ కుటుంబాన్ని వారింట్లోనే బందీలుగా చేసుకున్న ఉగ్రవాదులు వారి 18 ఏళ్ల కుమార్తెను కిరాతకంగా చంపేశారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు మిగతా నలుగురు ప్రాణాలు అరచేత పెట్టుకుని నేలపై కూర్చున్నారు.