Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..దిగి వచ్చిన బంగారం ధరలు..3 రోజుల్లో ఎంత తగ్గిందంటే!
పండుగ సమయంలో బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. బంగారం బాటలోనే వెండి కూడా కిందకి దిగి వస్తుంది.
పండుగ సమయంలో బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. బంగారం బాటలోనే వెండి కూడా కిందకి దిగి వస్తుంది.
నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే పసిడి, వెండి ధరలు హెచ్చుతగ్గులు అనేక కారకాలచే ప్రభావితం అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్, పలు దేశాల్లో కరెన్సీ విలువలు, వడ్డీరేట్లు, బంగారం వాణిజ్యానికి సంబంధించి ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు ఈ హెచ్చుతగ్గుదలకు దోహదం చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు మంచి అవకాశం. ఎందుకంటే గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
భారతీయులకు బంగారం మక్కువ ఎక్కువ. అదొక స్టేటస్ సింబల్. అంతేకాదు ఎప్పుడైనా కష్టాలు ఎదురైతే...ఆదుకునే గొప్ప సాధనం బంగారం. చాలామంది భారతీయులు తమ కష్టార్జితాన్ని శక్తిమేకు బంగారం కొనుగోలుకు ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ తక్కవ ధరకు బంగారం దొరికితే అక్కడ కొనుగోలు చేస్తుంటారు. భారతదేశం తన బంగారం అవసరాలను తీర్చుకునేందుకు 90శాతం దిగుమతులు చేసుకుంటుంది. 2022లో విదేశాల నుంచి 706 టన్నుల బంగారం భారత్ కు దిగుమతి అయ్యింది.