mulugu: బీజేపీలోకి మాజీ మంత్రి తనయుడు అజ్మీర ప్రహ్లాద్
మాజీ మంత్రి చందూలాల్ కుమారుడు బీఆర్ఎస్ అసంతృప్త నేత, ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ బీజేపీ (కమలం పార్టీ)లో చేరనున్నారు. సెప్టెంబర్ 12న ఇందుకు ముహూర్తం ఖరారైంది. అంతేకాకుండా ములుగు జిల్లాలో 20 వేల మందితో భారీ బహిరరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. ఈ సభలో చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, గరికపాటి మోహన్రావు సమక్షంలో కాషాయ కండువా ప్రహ్లాద్ కప్పుకోనున్నారు.