Big breaking:ఛత్తీస్ ఘడ్ లో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు
సుక్మా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో మావోయిస్టులకు , భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు.
సుక్మా జిల్లా నాగారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో మావోయిస్టులకు , భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు.
టర్కీ రాజధాని అంకారాలోని పార్లమెంట్ సమీపంలో బాంబు పేలుడు, కాల్పులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన రాజధాని అంకారాలో కలకలం రేపింది. టర్కీ ప్రభుత్వం దీనిని ఉగ్రవాద దాడిగా పేర్కొంది. ఈ ఘటనలో జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు.
మంచు లక్ష్మి...ఈమె సూపర్ ఫేమస్. మోహన్ బాబు కూతురిగానే కాదు...యాక్టర్ గా కూడా చాలా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో లక్ష్మి ఓ సెలబ్రిటీ. తరుచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యే ఆమె ఈరోజు ఓ వీడియో రిలీజ్ చేశారు. రీసెంట్ గా తాను చేసిన ట్వీట్ మీద వచ్చిన విమర్శలకు ఘాటుగా రిప్లై ఇచ్చారు.
మధ్యప్రదేశ్‌లోని దాతియాలోని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెండా గ్రామంలో భారీ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. దతియా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా అసెంబ్లీ నియోజకవర్గం. బుధవారం ఉదయం పశువులను పొలం నుంచి తరిమి కొట్టే విషయంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం కాల్పులకు దారి తీసింది.
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వారిని కాల్చివేస్తానని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదుర్కోలేని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టారని విమర్శించారు.
పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో పోలీస్ అధికారి తనువు చాలించిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. పోలీస్ అధికారి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాక తనతోపాటు కుటుంబీకులను సైతం చంపేశాడు స్థానికంగా ఏసీపీగా పని చేస్తున్న 57 ఏళ్ల భరత్ గైక్వాడ్.. భార్య, మేనల్లుడిని కాల్చి చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు భరత్ గైక్వాడ్ అతని భార్య మోని గైక్వాడ్, మేనల్లుడు దీపక్‌గా గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.