Skin Swelling : కీటకాలు కుట్టిన చోట చర్మం ఎందుకు ఉబ్బుతుంది?
ఒక కీటకం కరిచినప్పుడు సంబంధిత శరీర భాగానికి గాయమవుతుంది. దీనికి ప్రతిచర్యగా మన శరీరంలో ఆ భాగం ఉబ్బిపోతుంది. కీటకాల విషం వేగంగా వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఇలా జరుగుతుంది. గాయం లేదా క్రిమి కాటు విషయంలో శరీర రక్షణ వ్యవస్థ వెంటనే చురుకుగా మారుతుంది.