Telangana Elections: ఇదేనా 80వేల పుస్తకాలు చదివిన జ్ఞానం.. అభ్యర్థుల లిస్ట్‌పై మాటల మంటలు!
సీఎం కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు, YSRTP.. ఇలా అన్ని పార్టీల నేతలు ఫైర్ అయ్యారు. అభద్రత భావంతోనే రెండు చోట్ల పోటీకి కేసిఆర్ సిద్ధమయ్యారని బీజేపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కామెంట్స్ చేయగా.. కేసీఆర్ అహంకారం నవంబర్‌లో పోతుందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్ విమర్శలు గుప్పించారు. 2014 కంటే ముందు జరిగిన ప్రతీ పాపంలో నువ్వు(కేసీఆర్) ప్రత్యక్ష భాగస్వామివంటూ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.